V6 News

త్వరలో 294 వాహనాల వేలం.. అభ్యంతరాలుంటే చెప్పుకోండి

త్వరలో 294 వాహనాల వేలం..  అభ్యంతరాలుంటే చెప్పుకోండి
  •     సైబరాబాద్​ పోలీసుల ప్రకటన

చేవెళ్ల, వెలుగు: మొయినాబాద్ పోలీస్‌‌ స్టేషన్‌‌ ప్రాంగణంలో వివిధ కేసుల్లో పట్టుబడిన, వదిలివేసిన, క్లెయిమ్ చేయని 294 వాహనాలను ఉన్నాయని, వాటిని ఆన్‌‌లైన్‌‌ ద్వారా వేలం వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ పోలీసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వాహనాలపై ఎవరికైనా ఎటువంటి యాజమాన్య హక్కులు , ఇతర అభ్యంతరాలు ఉన్నా ఈ ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి ఆరు నెలల్లో సీపీకి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువులోగా స్పందించని వాహనదారుల వాహనాలను పబ్లిక్‌‌ లో వేలం వేస్తామని స్పష్టం చేశారు. వివరాలకు కోసం మోటార్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ ఆర్ఐ ఎన్‌‌.వీరలింగంను 94906 17317ను సంప్రదించవచ్చన్నారు. పూర్తి వివరాలు పోలీస్‌‌ కమిషనరేట్​వెబ్‌‌సైట్‌‌ www.cyberabadpolice.gov.in లో అందుబాటులో ఉన్నాయన్నారు.