విజయ్ దేవరకొండ పేరుతో మోసం.. ట్రాప్ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

విజయ్ దేవరకొండ పేరుతో మోసం.. ట్రాప్ చేసి అరెస్ట్ చేసిన పోలీసులు

హీరో విజయ్ దేవరకొండ పేరుతో సోషల్ మీడియాలో ఎకౌంట్ నిర్వహిస్తూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సైబర్ క్రైం పోలీసులు. కామారెడ్డి జిల్లా మిర్జాపూర్ కు చెందిన సాయికిరణ్ అనే యువకుడు విజయ్ దేవరకొండను కలవాలంటే ఈ నెంబర్ కు కాంటాక్ట్ కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో కాంటాక్ట్ లోకి వచ్చిన అమ్మాయిలతో చాట్ చేశాడు. ఈ విషయాన్ని గమనించిన విజయ్ వ్యక్తిగత మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు. సదరు నెంబర్ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నారు. అతన్ని విచారించిన అనంతరం 41A సీఆర్పీసి కింద నోటీసులు జారీ చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు.