బాలానగర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు

బాలానగర్ లో భారీగా గంజాయి చాక్లెట్లు

హైదరాబాద్ లోని బాలానగర్ లో గంజాయి చాకొలేట్ లు అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు బాలానగర్ SOT టీమ్. ఒరిస్సాకు చెందిన అనంత కుమార్ అనే వ్యక్తి ఘరక్ కంటా ప్రాంతంలో చిన్న కిరాణం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా గంజాయి చాకోలేట్ లు పట్టుబడ్డాయి. 

అనంత కుమార్ స్కూటీ డిక్కీలో 120 గంజాయి చాకోలేట్ లు పట్టుబడ్డాయని పోలీసులు తెలిపారు. గంజాయిని ఒరిస్సా నుంచి తీసుకొచ్చి స్థానికంగా ఉంటున్న కూలీలకు, విద్యార్థులకు అమ్ముతున్నాడని విచారణలో వెల్లడించాడు. నిందితునిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.