చిన జీయర్​పై ఫిర్యాదు

చిన జీయర్​పై ఫిర్యాదు
  • ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్​ చేయాలని కొందుర్గ్,
  • చిక్కడపల్లి​ పీఎస్​లలో ప్రజా సంఘాల కంప్లయింట్​
  • ఆయనను అరెస్ట్​ చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక

షాద్ నగర్/ముషీరాబాద్​, వెలుగు: మేడారం వన దేవతలు సమ్మక్క, సారలమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన జీయర్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేసి, అరెస్ట్ చేయాలని తెలంగాణ గిరిజన సంఘం నేతలు డిమాండ్​ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కొందుర్గ్  పోలీస్​స్టేషన్​లో, హైదరాబాద్​లోని చిక్కడపల్లి పోలీస్​స్టేషన్​లో  ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. గిరిజన ప్రజలతోపాటు కోట్లాదిమంది ఆరాధిస్తున్న గిరిజన దేవతల పట్ల చినజీయర్​ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్  అన్నారు. చిన జీయర్​ను తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు డిమాండ్ చేశారు. చినజీయర్​ను వెంటనే అరెస్ట్​ చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. హోలీ పండుగ రోజు చిన జీయర్  దిష్టిబొమ్మను  దహనం చేయాలని పిలుపునిచ్చారు. చిన జీయర్​పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని, లేకుంటే ఉద్యమిస్తమని తెలంగాణ గిరిజన సంఘం  రంగారెడ్డి జిల్లా కన్వీనర్ పి. శ్రీనునాయక్ హెచ్చరించారు.  

ములుగు ఏఎస్పీకి మేడారం పూజారుల కంప్లైంట్‌‌‌‌
తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన చిన జీయర్‌‌‌‌పై ఐపీసీ సెక్షన్‌‌‌‌ 504, 505 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ములుగు ఏఎస్పీ సుధీర్‌‌‌‌ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌కు గురువారం మేడారం పూజారుల సంఘం కంప్లైంట్‌‌ చేసింది. పూజారుల సంఘం అధ్యక్షులు సిద్ధబోయిన జగ్గారావు, ప్రధాన కార్యదర్శి చందా గోపాలరావు, పూజారులు చంద రఘుపతి, నాగరాజు, మంకిడి రవి, జిల్లా ఉద్యోగుల సంఘం సభ్యులు మంకిడి బుచ్చయ్య, వజ్జ రాజు తదితరులు పాల్గొన్నారు.