సూసైడ్ చేసుకుంటున్నానని వాట్సాప్ చేసి..

సూసైడ్ చేసుకుంటున్నానని వాట్సాప్ చేసి..

హైదరాబాద్: బ్రతుకు మీద విరక్తి చెందిన ఓ కానిస్టేబుల్  ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి అదృశ్యమయ్యాడు. తన మిత్రునికి వాట్సప్ మెసేజ్ పెట్టి కనిపించకుండా పోయాడు. ఈ సంఘటన బాచుపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

వికారాబాద్ జిల్లా,  దారుర్ మండలం, రాంపూర్ తండాకు చెందిన లక్ష్మణ్ (26) గత ఐదు సంవత్సరాలుగా  పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా(ARPC  pc No 8397) విధులు నిర్వహిస్తున్నాడు. వృత్తి రీత్యా గత 15నెలల క్రితం సైబరాబాదు కమీషనరేట్ కార్యాలయం నుండి బాచుపల్లి పిఎస్ కు ట్రాన్స్ ఫర్ అయ్యాడు. బాచుపల్లి సిఐ జీప్ కు డ్రైవర్ గా పనిచేసుకుంటూ భరత్ నగర్ కాలనీ లో నివాసం ఉంటున్నాడు.

మంగళవారం రాత్రి 10గంటలకు తన ఉద్యోగం ముగించుకొని బాచుపల్లి పిఎస్ నుండి బయలు దేరిన లక్ష్మణ్.. మార్గమద్యలో మద్యం సేవించి తన మిత్రుడు రాజు కు వాట్సప్ మెసేజ్ చేశాడు. ఆ మెసేజ్ లో తాను చనిపోవాలని అనుకుంటున్నానని, తన చావుకి ఎవరు కారణం కారని తెలిపాడు. దాంతోపాటుగా తన ATM పిన్ నెంబర్ లు తెలుపుతూ వీలైతే తన తల్లిదండ్రులను చూసుకోవల్సిందిగా కోరాడు. ఆ తర్వాత కనిపించకుండా పోయాడు.

మిత్రుడైన రాజు వెంటనే లక్ష్మన్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా, వారు తన కుమారుడిని ఆచూకి తెలియక పోవడంతో.. అతను పనిచేసే బాచుపల్లి పిఎస్ లో కంప్లేట్ ఇచ్చారు. బాచుపల్లి సిఐ జగదీశ్వర్ లక్ష్మన్ సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఆచూకి కోసం ప్రయత్నం చేయగా బుధవారం ఉదయం లక్ష్మణ్ బాంబే లో ఉన్నట్లు తెలిసింది. కాని ఇప్పుడు సిగ్నల్ దొరకడం లేదని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు అన్నారు