
సీఎం కేసీఆర్ ఆగస్టు 23న మెదక్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి వస్తుండగా స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్‌నేతలు స్థానిక డబుల్బెడ్రూం ఇళ్ల నుంచి బైక్‌లపై ర్యాలీగా బయల్దేరారు.
సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారుల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. కేసీఆర్ పర్యటన వేళ అటు టికెట్టు ఆశించి భంగపడిన మైనంపల్లి రోహిత్వర్గీయులు ఓ వైపు, కాంగ్రెస్‌నేతలు మరో వైపు నిరసనలు చేస్తుండటంతో జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.