దొరికిన వారిని అరెస్ట్ చేయొచ్చు.. ఇలా ఎన్ కౌంటర్లు చేయ‌కూడ‌దు

దొరికిన వారిని అరెస్ట్ చేయొచ్చు.. ఇలా ఎన్ కౌంటర్లు చేయ‌కూడ‌దు

ములుగుజిల్లా : ఆదివారం జిల్లాలో జ‌రిగిన‌ ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టు మృతదేహాలను చూసేందుకు వెళ్లిన ములుగు ఎమ్మెల్యే సీత‌క్క‌ను పోలీసులు అనుమ‌తించ‌లేదు. పోస్టు మార్టం జరుగుతున్న ములుగు ఏరియా హాస్పటల్ ను సందర్శించేందుకు వెళ్లిన సీతక్కను పోలీసులు అనుతించకపోవడంతో ఆమె వెనుతిరిగారు.

ఆనాడు ఆంధ్ర పాలకుల ఎన్ కౌంటర్ చేస్తే వ్యతిరేకించామ‌ని, నేడు తెలంగాణ పాలకుడిగా చెప్పుకునే ఆంధ్ర మూలాలున్న కేసీఆర్ హయాంలో ఎన్ కౌంటర్లు జర‌గడాన్ని ఖండిస్తున్నామ‌ని ఆమె అన్నారు. ఉద్యమ సమయంలో మావోయిస్టు అజెండానే తన అజెండా గా కేసీఆర్ మాయమాటలు చెప్పాడ‌న్నారు. ఎన్‌కౌంట‌ర్లు లేని తెలంగాణ‌ ను సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మూడు రోజులకే శృతి, విద్యాసాగర్ ల‌ను ఎన్ కౌంటర్ చేయించార‌ని, ఇప్పుడు ములుగు జిల్లాలో మ‌రో ఇద్దరిని ఎన్ కౌంటర్ చేయించార‌ని అన్నారు. ఉద్యమకాలంలో ఇచ్చిన మాట ప్రకారం దొరికిని వారిని అరెస్ట్ చేయొచ్చు కానీ, ఇలా ఎన్ కౌంటర్లు చేయకుండా ప్రభుత్వం శాంతియుతంగా వ్యవహరించాలని ఆమె అన్నారు

ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ‌ఎజెన్సీ ప్రాంతాలు భయంతో బతుకుతున్నాయని, రెండు వైపుల నుంచి శాంతియుత వాతారనణం ఉన్నప్పుడే ప్రజలు స్వేచ్చగా ఉండగలుతారని సీత‌క్క అన్నారు. తప్పు చేసిన వారిపై ప్రజలే తిరగబడుతారని, ఎవరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దని మావోయిస్టు పార్టీ ప్రజాప్రతినిధులను ఆమె కోరారు.