ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు పోలీసులు.  2024, మార్చి 10న ట్యాపింగ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇప్పటి వరకు నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. నిందితులుగా ఆరుగురిని చేర్చారు పోలీసులు. ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. 

రాజకీయ దురుద్దేశంతోనే తమను అరెస్టు చేసినట్టు నాంపల్లి కోర్టులో నిందితుల తరుపు లాయర్లు వాదనలు వినిపించారు. చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఇంకా విచారించాల్సింది ఉన్నందున బెయిల్ మంజూరు చేయొద్దని పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) కోర్టును కోరారు.  బెయిల్ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. జూన్ 12వ తేదీ బుధవారం తీర్పు వెల్లడించనున్నట్లు తెలిపింది.