మెట్టుగూడలో అర్ధరాత్రి గాల్లోకి పోలీసుల కాల్పులు

మెట్టుగూడలో అర్ధరాత్రి గాల్లోకి పోలీసుల కాల్పులు
  •     పారిపోతున్న యువకులను పట్టుకునేందుకు గన్ ​ఫైరింగ్
  •     నలుగురు అరెస్ట్.. మెట్టుగూడలో ఘటన 

పద్మారావునగర్, వెలుగు : చిలకలగూడ పోలీస్​స్టేషన్​ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి పోలీసుల కాల్పులు కలకలం రేపాయి. వివరాలు ఇలా ఉన్నాయి. వరుస చోరీలు, హత్యల నేపథ్యంలో ఏఆర్, క్రైమ్​ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి మెట్టుగూడ ప్రాంతంలో డెకాయి ఆపరేషన్​చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత 2.40 గంటల ప్రాంతంలో కొందరు పోలీసులు మఫ్టీలో ఫుట్​పాత్​పై మాటువేశారు.

అదే టైంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు మఫ్టీ పోలీస్​జేబులో చోరీకి యత్నించారు. పోలీసులు అలర్ట్​అవడంతో పరుగులు తీశారు. వారిని పట్టుకునేందుకు ఓ కానిస్టేబుల్ తన చేతిలోని గన్​తో గాలిలోకి కాల్పులు జరిపారు. యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నలుగురూ స్టూడెంట్లని పోలీసులు గుర్తించారు. వారికి ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగేందుకు వచ్చారని చెప్పారు.