మావోయిస్టుల భారీ కుట్ర.. మందు పాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

మావోయిస్టుల భారీ కుట్ర.. మందు పాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు

చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు అమర్చిన భారీ మందు పాతరను కనుగొని నిర్వీర్యం చేశారు పోలీసులు. కాంకేర్ జిల్లా గుండిహిడి బడగాం ప్రధాన రహదారిపై మావోయిస్టులు మందు పాతర అమర్చారు. పోలీసులను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన భారీ మందు పాతరను గుర్తించి.. వెంటనే నిర్వీర్యం చేశారు పోలీసులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. మరోవైపు.. ఇంకా ఎక్కడెక్కడ మందు పాతర పెట్టారో గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు.