మావోయిస్టుల డంప్స్ వెలికితీత.. ఛత్తీస్గఢ్ కాంకేర్ జిల్లాలో భద్రతాబలగాల తనిఖీ

మావోయిస్టుల డంప్స్ వెలికితీత.. ఛత్తీస్గఢ్  కాంకేర్ జిల్లాలో భద్రతాబలగాల తనిఖీ

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రం బస్తర్  ఐజీ సుందర్​రాజ్​ పీ పర్యవేక్షణలో కాంకేర్​ జిల్లాలో మంగళవారం భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహించాయి. జిల్లాలోని కోయిలీబేడా, పర్తాపూర్​ పోలీస్​స్టేషన్ల పరిధిలోని గుంచూర్, ఫదాలాంసీ గ్రామ సమీపంలోని గుట్టల్లో స్థానిక పోలీసులు, డీఆర్జీ, బీఎస్ఎఫ్, బీడీఎస్​ బలగాలు కూంబింగ్​ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టుల డంప్​లు బయటపడ్డాయి.

 303 రైఫిల్స్, ఎస్ఎల్ఆర్​ తుపాకులు, తూటాలు, మ్యాగజైన్లు, ఎలక్ట్రిక్​ డిటోనేటర్లు, టిఫిన్​ బాక్సు బాంబులు, పవర్  కంట్రోలర్లు, వైర్, విప్లవ సాహిత్యం దొరికాయి. సరెండర్​ అయిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు బస్తర్​ దండకారణ్యంలో డంప్​లు స్వాధీనం చేసుకుంటున్నట్లు ఐజీ తెలిపారు.