ప్రియాంక మర్డర్ మిస్టరీ.. నలుగురు అరెస్ట్

ప్రియాంక మర్డర్ మిస్టరీ.. నలుగురు అరెస్ట్

నగరంలో సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక హత్య కేసులో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లారీ డ్రైవర్ ,క్లీనర్ తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితులు రంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు, అనంతపురం జిల్లాకు చెందిన మరో ఇద్దరిగా గుర్తించారు .

ప్రియాంకపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య చేసి మృతదేహాన్ని దుపట్లో తీసుకెళ్లి కిరోసిన్ పోసి నిప్పంటించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రియాంక స్కూటీని వారు కావాలనే పంక్చర్ చేసి తప్పుదారి పట్టించినట్లుగా నిర్దారణకు వచ్చారు . కీలక ఆధారాలతో నిందితులను కాసేపట్లో మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు పోలీసులు.