
వరుస దొంగతనాలకు పాల్పడిన చైన్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ ను సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఉమేష్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఈ నెల 19న ఆరు గంటల్లో ఆరు దొంగతనాలు చేశాడు. ఉమేష్ ఖతిక్ కోసం పోలీసులు గుజరాత్, మహారాష్ట్రకు వెళ్లారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉమేష్ ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. గుజరాత్, మహారాష్ట్రలలో ఉమేష్ పదుల సంఖ్యలో చోరీలు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు దీపక్ తో కలిసి గుజరాత్ లో నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.