కేసీఆర్ మహబూబాబాద్ టూర్ .. లీడర్ల ముందస్తు అరెస్ట్

కేసీఆర్ మహబూబాబాద్ టూర్ .. లీడర్ల ముందస్తు అరెస్ట్

సీఎం కేసీఆర్ మహబూబాబాద్ టూర్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతిపక్షాల నాయకులు, వివిధ సంఘాల లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుని పలు స్టేషన్లకు తరలించారు.  సీఎం పర్యటనను అడ్డుకునే అవకాశం ఉందనే నెపంతో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా తమను అకారణంగా అరెస్ట్ చేయడంపై ప్రతిపక్ష నాయకులు మండిపడుతున్నారు. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, న్యూడెమోక్రసీ,పిడిఎస్ సంఘాల లీడర్లు ఉన్నారు. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 

మహబూబాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల లను సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈమేరకు అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతిరాథోడ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్థానిక ప్రజాప్రతినిధులు సైతం ఆఫీసర్లకు సూచనలు, సలహాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

షెడ్యూల్ రిలీజ్ చేసిన సీఎంవో..

కేసీఆర్ టూర్ కు సంబంధించిన షెడ్యూల్ ను సీఎం కార్యాలయం బుధవారం విడుదల చేసింది. ఉదయం 11 గంటలకు పట్టణ శివారు తాళ్లపూసపల్లి వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు కేసీఆర్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకు వెళ్తారు. పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అనంతరం 11.40 గంటలకు కలెక్టరేట్ కు చేరుకుంటారు. కలెక్టరేట్ ప్రారంభించాక ఆఫీసర్లతో మాట్లాడుతారు. మధ్యాహ్నం 1.25 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం వెళ్తారు.