హైకోర్టుకు వామన్ రావు దంపతుల హత్య కేసు నివేదిక

హైకోర్టుకు వామన్ రావు దంపతుల హత్య కేసు నివేదిక

అడ్వకేట్ దంపతులు వామనరావు, నాగమణి దంపతుల హత్యపై విచారించింది హైకోర్టు. కేసు దర్యాప్తు స్థాయి నివేదికను హైకోర్టుకు సమర్పించారు పోలీసులు. ఏడుగురు నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు కోర్టుకు తెలిపారు ఏజీ. 32 మంది ప్రత్యక్ష సాక్షుల్లో 26 మంది వాంగ్మూలాలు మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేశామన్నారు. నిందితులు లచ్చయ్య, వసంతరావు, అనిల్ మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు FSLకి పంపించామన్నారు. FSL నివేదిక రావడానికి 4 వారాలు పట్టే అవకాశం ఉందన్నారు. మే 17నాటికి హత్య జరిగి 90 రోజులు అవుతుందని.. అప్పటివరకు సమగ్ర ఛార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉందని కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. మరోవైపు పోలీసుల నివేదికలు తమకు ఇచ్చేలా ఆదేశించాలని కోరారు వామనరావు తండ్రి తరుపు న్యాయవాది. అయితే దీనిని తోసిపుచ్చింది హైకోర్టు. పోలీసుల నివేదికపై తాము సంతృప్తి చెందామన్న హైకోర్టు... పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది హైకోర్టు. 

ఫిబ్రవరి 17న హైకోర్టు అడ్వకేట్ దంపతులు..వామనరావు, నాగమణి దంపతులను దారుణంగా హత్య చేశారు చేశారు దుండగులు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర పట్టపగలే నడిరోడ్డుపై వామనరావు దంపతులపై దాడి చేశారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. హత్య కోసం కత్తులు, కారు సమకూర్చిన బిట్టు శ్రీనును రిమాండ్ కు తరలించారు పోలీసులు. నిందితులను కస్టడీకి తీసుకొని కూడా విచారించారు. రెండు రోజుల పాటు వెతికి.. లాయర్ల మర్డర్ కు ఉపయోగించిన కత్తులను.. పార్వతీ బ్యారేజీ నుంచి బయటికి తీశారు పోలీసులు. ఇక న్యాయవాద దంపతుల హత్యపై ఇప్పటికి రెండుసార్లు విచారించింది హైకోర్టు.