ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

పది గంటల టెన్షన్ సద్దుమణిగింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్ క్లియర్ అయ్యింది. రైలు పట్టాలు, ప్లాట్ ఫామ్ పై కూర్చున్న ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఆందోళన విరమించేందుకు ససేమిరా అంటున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేసి ఏఆర్​ఓ కార్యాలయానికి తరలించారు. రాత్రి 7 గంటల 30 నిమిషాలకు యథావిధిగా రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. రాత్రంతా తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. అన్నిప్లాట్ ఫామ్స్, సిగ్నలింగ్ వ్యవస్థ బాగుందన్నారు. ఆందోళనకారుల విధ్వంసంలో స్టేషన్ లో ని స్టాల్స్, 4 బోగీలు, 8 ఇంజిన్లు ధ్వంసం అయ్యాయని తెలిపారు. దాదాపు 7 కోట్ల ఆస్తులు ధ్వంసం చేశారన్నారు. రైల్వే ఉద్యోగులు, ప్యాసింజర్లకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు.