హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. శ్రావన మానంలో ఎక్కవగా శుభకార్యలు నిర్వహిస్తారు. దీంతో హిజ్రాలు వేడుకలకు వెళ్లి వేలకువేలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాలనీలు బస్తీలలో జరిగే శుభకార్యాలు, గృహప్రవేశాలు వేడుకలు, హోటల్లు, మాల్స్ ప్రారంభోత్సవాలలో హిజ్రాలు వేలకు వేలు డిమాండ్ చేస్తూ బలవంతపు వసూళ్ల చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది.
దీంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ సీఐ అంజయ్య హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చి హెచ్చరించారు. శుభకార్యాల్లో వారి ఇష్టంతో ఎంతోఅంత ఇస్తే తీసుకోవాలి కానీ.. వారి ఇంట్లో పిల్లల్ని, బంధువులను భయభ్రాంతులకు గురి చేసి వెకిలి చేష్టలు చేసినా.. పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేసినా కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు.
