నంబర్ ప్లేట్ టాంపరింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల నజర్

 నంబర్ ప్లేట్ టాంపరింగ్‌పై ట్రాఫిక్ పోలీసుల నజర్

వాహనాల నంబర్ ప్లేట్ టాంపరింగ్‌పై సీటీ ట్రాఫిక్ పోలీసులు ఫోకస్ పెట్టారు. నంబర్ ప్లేట్‌లు టాంపిరింగ్ చేస్తే వారిపై  క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. కొందరు నేరస్ధులు నంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణిస్తుండడంతో ట్రాఫిక్ పోలీసులు సీటీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.  నంబర్ ప్లేట్ తీసేయడం, మాస్కు కట్టడం, ప్రింట్ తుడిచేయడాన్ని నేరంగా పరిగణిస్తామని, వారిపై  చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. నంబర్ ప్లేట్ లేకుండా కొందరు వాహనాలు నడుపుతూ కిడ్నాప్ లు, దొంగతనాలకు పాల్పడుతున్నారని ట్రాఫిక్ సీపీ రంగనాథ్ అన్నారు.  నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపుతే  కఠిన చర్యలు తప్పవని సీపీ వాహనదారులను హెచ్చరించారు.