కేఏ పాల్ హౌస్ అరెస్ట్

కేఏ పాల్ హౌస్ అరెస్ట్

కేటీఆర్ మనుషులు తనపై దాడి చేశారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ ఆఫీసుకు వెళ్తుండగా తనను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అమీర్ పేటలోని పార్టీ కార్యాలయంలో తనను హౌస్ అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీసులు కేటీఆర్ మనుషుల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనపై దాడి చేసి తాను రైతుల్ని కొట్టానని అబద్దాలు చెబుతున్నారని వాపోయారు. డీజీపీ కనీసం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను చేసిన తప్పేంటో చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. 

తనపై తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు. తాను ఆంధ్రావాడినైతే కేసీఆర్ కూడా ఆంధ్రావాడేనని అన్నారు. తండ్రీ కొడుకులంటే తనకేం భయం లేదన్న పాల్.. పారిపోయేందుకు తాను చంద్రబాబును కాదని అన్నారు. తనను ఎంతకాలం నిర్బంధిస్తారో చూస్తానని అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

ఒకే మండపంలో ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న మాజీ సర్పంచ్

ఓయూలో రాహుల్ సభను ఎవరూ అడ్డుకోలేరు