పట్నం పబ్లిక్: ఆ రూట్లలో ఇవాళ ట్రాఫిక్​ మళ్లిస్తున్నారు.. గమనించండి

పట్నం పబ్లిక్: ఆ రూట్లలో ఇవాళ ట్రాఫిక్​ మళ్లిస్తున్నారు.. గమనించండి
  • మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 10‌‌‌‌ గంటల వరకు
  • చార్మినార్,చాదర్‌‌‌‌ఘాట్,మదీనా పరిసర ప్రాంతాల్లో డైవర్షన్స్

హైదరాబాద్‌‌,వెలుగు: మొహర్రం సందర్భంగా ఓల్డ్‌‌సిటీలో పోలీసులు శనివారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బీబీకా అలావా ఊరేగింపునకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10  వరకు సౌత్‌‌జోన్‌‌ పరిధిలో ట్రాఫిక్ డైవర్షన్స్‌‌ చేశారు.

ఈ ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్‌‌, సౌత్‌‌జోన్‌‌ పోలీసులు శుక్రవారం పర్యవేక్షించారు.ఊరేగింపు ప్రారంభమయ్యే డబీర్‌‌‌‌పురాలోని బీబీకా ఆలాంను సంర్శించారు.నిర్వాహకులు పలు సూచనలు చేశారు.ట్రాఫిక్ చీఫ్‌‌ సుధీర్‌‌‌‌బాబు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

బీబీకా అలావా నుంచి డబీర్‌‌‌‌పురా,బడా బజార్‌‌‌‌,పురాణి వేలి,యాకత్‌‌పుర,మొఘల్‌‌పురా,తలాబ్‌‌కట్ట,చార్మినార్‌‌‌‌,నయాపూల్‌‌, మదీనా క్రాస్ రోడ్స్‌‌,చాదర్‌‌‌‌ఘాట్‌‌,అఫ్జల్‌‌గంజ్‌‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు,డైవర్షన్స్‌‌ ఉంటాయని తెలిపారు.