ట్యాంక్ బండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

ట్యాంక్ బండ్ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇయ్యాల రాత్రి 8 వరకు డైవర్షన్స్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌,వెలుగు: అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జయంతి సందర్భంగా నేడు ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ డైవర్షన్స్‌‌‌‌‌‌‌‌ అమల్లో ఉండనున్నాయి.  ఇందుకు సంబంధించి జాయింట్‌‌‌‌‌‌‌‌ సీపీ ఏవీ రంగనాథ్‌‌‌‌‌‌‌‌ బుధవారం  నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ రిలీజ్ చేశారు.  లోయర్ ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్, కట్టమైసమ్మ నుంచి అంబేద్కర్ విగ్రహం వైపు వచ్చే వెహికల్స్ ను తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీదుగా ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి వైపు మళ్లించనున్నారు.

చిల్డ్రన్స్ పార్కు నుంచి వచ్చే వెహికల్స్ ను డీబీఆర్ మిల్స్, కట్టమైసమ్మ, తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు మీదుగా మళ్లించనున్నారు. లిబర్టీ నుంచి వచ్చే వెహికల్స్ ను బీఆర్కే భవన్, ఐటీ ఆఫీస్, అప్పర్ ట్యాంక్ బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వైపు మళ్లించనున్నారు.  ఎన్టీఆర్ మార్గ్, ఇక్బాల్ మినార్, లిబర్టీ నుంచి వచ్చే వెహికల్స్ ను తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఐటీ ఆఫీస్, క్రిస్టల్ హోటల్ ఎడమవైపునకు మళ్లించనున్నారు.

ఆర్టీసీ బస్సులు ఇలా

నిరంకారి భవన్, సైఫాబాద్ ఓల్డ్ పీఎస్ నుంచి లిబర్టీ వైపు వచ్చే బస్సులు ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, బషీర్ బాగ్ మీదుగా వెళ్తాయి. రాణిగంజ్, కర్బాల మైదాన్ నుంచి లిబర్టీ, బషీర్ బాగ్ వైపు వచ్చే బస్సులు.. చిల్డ్రన్స్ పార్క్, డీబీఆర్ మిల్స్, ధోబీ ఘాట్, కట్టమైసమ్మ,  తెలుగుతల్లి ఫ్లై ఓవర్,ఇందిరాపార్క్  మీదుగా వెళ్తాయి.