తాండూరులో రూ.3. 50 లక్షలు సీజ్

తాండూరులో  రూ.3. 50 లక్షలు సీజ్

వికారాబాద్, వెలుగు: ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిధి తాండూరు పట్టణంలోని శాంతిమహల్ థియేటర్ రోడ్ లో వ్యాపారి పురుషోత్తం కారులో రూ.3 లక్షల 50 వేలను పోలీసులు గుర్తించారు. 

ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి పేపర్లు చూపించకపోవడంతో వాటిని స్క్రీనింగ్ కమిటీకి అప్పజెప్పినట్లు సీఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.