ప్రణీత్ రావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. బై ఎలక్షన్‪ టైంలో ఫోన్ ట్యాఫింగ్

ప్రణీత్ రావు కేసులో కీలక విషయాలు వెలుగులోకి.. బై ఎలక్షన్‪ టైంలో ఫోన్ ట్యాఫింగ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు తిరిగింది. బంజారాహిల్స్ పీఎస్ లో ప్రణీత్, భుజంగరావును 8గంటలపాటు పోలీసులు విచారించారు. విచారణలో కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ భుజంగరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ తో కలిసి ఫోన్ ట్యాపింగ్ కు  పాల్పడినట్లు నిర్ధారించారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. 2019 జనరల్ ఎలక్షన్, మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక బై ఎలక్షన్ సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. తాజా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రత్యర్థుల డబ్బులే టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు నిర్ధారించారు.