ఐటీసీ కోహినూర్ పబ్ ఘటనపై విచారణలో కీలక విషయాలు

ఐటీసీ కోహినూర్ పబ్ ఘటనపై విచారణలో కీలక విషయాలు

ఐటీసీ కోహినూర్ ఓటినో బార్ అండ్ పబ్ ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. యువతి స్నేహితులు విష్ణు, విక్రమ్ తమపై దాడి చేశారని మయాంక్ సహా అతడి ఫ్రెండ్స్ ఫిర్యాదు చేశారు. మాయంక్ ఇచ్చిన ఫిర్యాదుతో బాధితురాలితో పాటు బాడీ బిల్డర్ విక్రమ్, విష్ణుపై పోలీసులు కేసు నమోదు చేశారు.  విచారణలో భాగంగా మయాంక్ తోపాటు అతడి ఫ్రెండ్స్ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు రేప్ చేసి చంపేస్తామని బెదరింపులకు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. ఇక మయాంక్, అతని స్నేహితులకు బాధితురాలితో గతంలో పరిచయం ఉన్నట్లు వెల్లడైంది. పబ్ లో తోపులాట తరువాత, నో స్మోకింగ్ ఏరియాలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో బాధితురాలు ఫ్రెండ్ విష్ణుకు గాయాలవ్వగా..మాయంక్ గ్యాంగ్ పై  బాడీ బిల్డర్ విక్రమ్ దేవ్ దాడి చేశాడు. కాగా విక్రమ్ దేవ్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు.. నో స్మోకింగ్ ఏరియా లో సీసీ కెమెరాలు లేకపోవడం తో ఏమి జరిగిందనే దానిపై విచారణ చేపట్టారు.

ఏం జరిగిందంటే..?

కాగా శనివారం రాత్రి ఓ యువతి ఇద్దరు స్నేహితులతో కలిసి  ఐటీసీ కోహినూర్ ఓటినో బార్ అండ్ పబ్ కు వెళ్లింది. అయితే కొందరు యువకులు..యువతిని నంబర్ ఇవ్వమని అడుగుతూ అసభ్యంగా ప్రవర్తించిన్నట్లు ఆమె ఫ్రెండ్స్ తెలిపారు. అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రేప్ చేస్తామని బెదిరించారని..బీర్ బాటిల్ తో తలపగలగొట్టారని తెలిపారు. దీనిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. బార్ అండ్ పబ్ రిక్వెస్ట్ తో ముందు కంప్లైంట్ ఇవ్వలేదని..సీసీ కెమెరాలో చూస్తూ అన్ని నిజాలు తెలుస్తాయని తెలిపారు.