సిగ్నల్స్​ సింక్రనైజేషన్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్

సిగ్నల్స్​ సింక్రనైజేషన్‌తో  హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్

హైదరాబాద్‌, వెలుగు: సిటీలో ట్రాఫిక్‌ జామ్​ సమస్యకు చెక్ పెట్టేందుకు పోలీసులు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. వాహనాలు రద్దీగా ఉండే రోడ్లలో సిగ్నల్స్ సింక్రనైజేషన్​ సిస్టమ్​ను అమల్లోకి తేనున్నారు. ఒక సిగ్నల్‌ వద్ద గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత వెహికల్‌ మూవ్ మెంట్ కు అనుగుణంగా, అదే రూట్‌లోని సిగ్నల్ వద్ద కూడా గ్రీన్ సిగ్నల్‌ ఉంటుంది. ఇలా మూడు నుంచి నాలుగు సిగ్నల్స్‌ వరకు ఇదేవిధంగా సింక్రనైజ్‌ చేయనున్నారు.

 జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్‌ నుంచి పంజాగుట్ట, బంజారాహిల్స్ రోడ్‌ నం.1 నుంచి మాసబ్ ట్యాంక్‌, మెహిదీపట్నం రూట్లలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఆయా రూట్లలో వచ్చే  ఫలితాలను బట్టి సిటీ అంతటా గ్రీన్ సిగ్నల్‌ సింక్రనైజేషన్‌ను అమలు చేయనున్నారు.  ఇందుకు ముందుగా ట్రాఫిక్ రద్ద ఎక్కువగా ఉంటే రూట్లను గుర్తించారు. ఇందుకు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆఫీసుల పని వేళలను పరిగణలోకి తీసుకుంటారు. 

ఆయా రూట్లలో సాయంత్రం 4  నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌లో గ్రీన్ ఆపరేట్ చేయనున్నారు. వాహనాల సంఖ్య, రాకపోకలపై రూట్‌మ్యాప్ తయారు చేశారు. ఇందుకు ప్రధానంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకాపూల్‌, మెహిదీపట్నం, సికింద్రాబాద్ సహా అన్ని జంక్షన్స్‌ వద్ద రెడ్‌, గ్రీన్ సిగ్నల్స్‌ ఆపరేషన్స్‌లో మార్పులు చేస్తారు.