రామగుండం NTPC దగ్గర.. తీవ్ర ఉద్రిక్తత

రామగుండం NTPC  దగ్గర.. తీవ్ర ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా: రామగుండం NTPC పవర్ ప్రాజెక్టు లేబర్ గేట్ దగ్గర.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ.. కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన... టెన్షన్ పరిస్థితులకు దారి తీసింది. ఫ్యాక్టరీలోపలికి చొచ్చుకెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించారు. దీంతో కార్మికులపై CISF పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆందోళన చేపట్టిన బీజేపీ నేత, కార్మిక సంఘం నాయకుడు కౌశిక్ హరితో పాటు.. కార్మికులను చితకబాదారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కార్మికులు.. CISF పోలీసులపై రాళ్లు విసిరారు. ఒక కార్మికుని తలకు తీవ్రగాయాలు కాగా.. చాలామంది కార్మికులకు దెబ్బలు తగిలాయి.