మాస్క్‌ పెట్టుకోలేదని.. ఫీల్డ్ అసిస్టెంట్స్ అరెస్ట్

మాస్క్‌ పెట్టుకోలేదని.. ఫీల్డ్ అసిస్టెంట్స్ అరెస్ట్

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఫీల్డ్ అసిస్టెంట్స్ పై కేసులు పెట్టారు పోలీసులు. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి మాస్కులు లేకుండా వచ్చారంటూ..22 మందిపై కేసు నమోదు చేశారు. ఫీస్ట్ అసిస్టెంట్స్ ను స్టేషన్ కు తరలించారు. 

హుజురాబాద్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. జాబుల నుంచి తొలగించిన తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నామినేషన్ వేయడానికి వెళ్లారు. అయితే అధికారులు తమకు నామినేషన్ల పత్రాలు లేవంటూ బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే విధుల్లోకి తీసుకోకపోతే.. టీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతామన్నారు. 

సాఫ్ట్ వేర్ ఉద్యోగి అరెస్ట్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి నామినేషన్ దాఖలు చేశారు. తనను గెలిపిస్తే యువతకు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. పదోతరగతి చదువుకున్నవారికి కూడా 50 వేలకు పైగా వేతనం వచ్చేలా చూస్తానన్నారు చంద్రశేఖర్.

SEE MORE NEWS

ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులకు కేటీఆర్ ఫోన్

కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం 30 రోజుల్లో ఇవ్వాలి

హీరో రామ్‌కు గాయాలు..షూటింగ్ వాయిదా