30 రోజుల్లో కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం

30 రోజుల్లో కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం

కరోనా మృతుల కుటుంబ సభ్యులకు 30 రోజుల్లో పరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. రూ.50 వేల పరిహారాన్ని ఇవ్వాల్సిందేనని చెప్పింది. అప్లికేషన్ పెట్టిన 30 రోజుల్లో ఖచ్చితంగా పరిహారం ఇవ్వాలని కోర్టు చెప్పింది. వీటిని రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి రాష్ట్రాలే చెల్లించాలని చెప్పింది. డెత్ సర్టిఫికేట్ లో కాజ్ ఆఫ్ డెత్ కరోనా అని లేదనే కారణంతో రాష్ట్రాలు పరిహారాన్ని రిజెక్ట్ చేయొద్దని న్యాయమూర్తి చెప్పారు. డెత్ సర్టిఫికేట్ సవరణ చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబసభ్యులు.. కమిటీకి సరైన  డాక్యుమెంట్లు ఇచ్చి డెత్ సర్టిఫికేట్ లో సవరణ చేయించుకోవచ్చన్నారు. 

see more news

హీరో రామ్‌కు గాయాలు..షూటింగ్ వాయిదా

‘మా’ ఎన్నికల్లో గెలిచి సత్తా చూపిస్తా

ఒక్క కారణంతో ఇన్ని కేసులా: హైకోర్టు ఆగ్రహం

బలవంతంగా లాక్కెళితే కిడ్నాప్ కేసు పెడతా