నన్ను బలవంతంగా లాక్కెళితే కిడ్నాప్ కేసు పెడతా 

నన్ను బలవంతంగా లాక్కెళితే కిడ్నాప్ కేసు పెడతా 

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వంపై భగ్గుమన్నారు. మోడీ సర్కార్ రైతులను అణచివేస్తోందని ప్రియాంక సీరియస్ అయ్యారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్రి చట్టాలను రద్దు చేయాలంటూ ఆదివారం ఉత్తర్ ప్రదేశ్‌లో రైతులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. నల్లజెండాలతో రైతులు నిరసన తెలుపుతుండగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కాన్వాయ్ వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మృతి చెందారు. దీంతో ఆగ్రహించిన రైతులు కార్లలోని ముగ్గురు బీజేపీ కార్యకర్తలను, ఓ డ్రైవర్‌ను కొట్టి చంపారు. దీంతో బాధిత రైతు కుటుంబాలను కలిసేందుకు ప్రియాంక గాంధీ వెళ్లారు. అయితే ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అన్నదాతలు కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వినడం లేదన్నారు. ఇది రైతుల దేశమని.. బీజేపీది కాదన్నారు. 

‘లీగల్ వారెంట్ ఇవ్వండి లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపోండి. చట్టం నాకు కూడా తెలుసు. నాకు తెలియదు అనుకోకండి. నన్ను బలవంతంగా లాక్కెళితే.. కిడ్నాప్, అటెంప్ట్ కిడ్నాప్, అటెమ్ట్ హామ్ కేసులు పెడతాను. మహిళా పోలీసులను ఎందుకు ముందు పెడుతున్నారు? మహిళలతో మాట్లాడటం నేర్చుకోండి. నన్ను ఇక్కడివరకు ఈడ్చుకుంటూ వచ్చారు. వాహనంలో ఎక్కిస్తే  కిడ్నాప్ కేసు పెడతాను. వారెంట్ చూపించి దేని ఆధారంగా నన్ను అరెస్టు చేస్తున్నారో చెప్పండి’ అని పోలీసులను ప్రియాంక క్వశ్చన్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం: 

సీఎం ఫ్లయిట్ ల్యాండింగ్‌కు నో పర్మిషన్.. యూపీ వెళ్లాలంటే వీసా కావాలా?

వర్క్ ఫ్రమ్‌‌ హోమ్‌‌తో సైడ్​​ జాబ్స్​ కూడా

ప్రాణాలు పోతున్నా పట్టించుకుంటలే