సహనం కోల్పోయిన పోలీసులు.. హాస్పిటల్కు వెళ్లాలి, బారికేడ్లు తీయాలన్నందకు చితకబాదారు

సహనం కోల్పోయిన పోలీసులు.. హాస్పిటల్కు వెళ్లాలి, బారికేడ్లు తీయాలన్నందకు చితకబాదారు
  • ట్యాంక్ బండ్​పై రోడ్డుకు అడ్డుగా ఉన్న వారిపై లాఠీచార్జ్​

ఎంజే మార్కెట్ వద్ద వాహనదారుడిని ఈడ్చుకెళ్లిన ట్రాఫిక్ ఎస్ఐ పాండుబషీర్​బాగ్, వెలుగు: గణేశ్ నిమజ్జనం సందర్భంగా కొందరు పోలీసులు సహనం కోల్పోయి ప్రవర్తించారు. నిమజ్జనానికి వచ్చిన వారిపై లాఠీలు ఝలిపించారు. శనివారం రాత్రి అప్పర్ ట్యాంక్​బండ్​పై రోడ్డుకు అడ్డంగా కొందరు సౌండ్ ​పెట్టి, ముందుకు జరగకుండా డ్యాన్స్​లు వేస్తున్నారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 

అలాగే ఎంజే మార్కెట్​వద్ద నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన బారికేడ్లు తొలగించాలని, హాస్పిటల్​కు వెళ్లాల్సి ఉందన్న ఓ వాహనదారుడిపై అబిడ్స్ ట్రాఫిక్ ఎస్ఐ పాండు రాజుతో పాటు మరికొందరు పోలీసులు చేయి చేసుకొని, పక్కకు ఈడ్చుకెళ్లారు.