పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఎస్సై తాపత్రయం

పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ఎస్సై తాపత్రయం

ఈ రోజుల్లో చదువనేది అత్యంత ఖరీదైన విషయంగా మారిపోయింది. రోజురోజుకూ పెరిగుతున్న నిత్యావసర ధరలతో పాటు, ప్రైవేటు స్కూళ్లల్లోనూ ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులతో సామాన్యుడు అతలాకుతలం అవుతున్నాడు. వీళ్ల పరిస్థితే ఇలా ఉంటే... రోడ్డు పక్కన బిక్షాటన చేసే వారి పిల్లల చదువు గురించి చెప్పాలంటే అత్యంత భారంగా తోస్తోంది. అయితే వీరికి ఏదైనా చేయాలనే ఆశయంతో..  ఓ పోలీస్ ఆఫీసర్ వారికి ఉజ్వల భవిష్యత్ అందించేందుకు కృషి చేసేందుకు పూనుకున్నాడు. గత కొన్ని రోజులుగా తాను ఓ పాఠశాలను ప్రారంభించానని, బిక్షాటన చేసే వారి పిల్లలకు అక్కడ పాఠాలు బోధిస్తున్నానని ఆ పోలీస్ తెలిపారు. అయోధ్యలోని ఉత్తర్ ప్రదేశ్ లో రంజిత్ యాదవ్ అనే సబ్ ఇన్స్ పెక్టర్ ఇలా రోడ్డు పక్కన, చదువుకు దూరమైన పిల్లలకు విద్యనందించేందుకు కృషి చేస్తున్నారు. వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ పిల్లలు చదువుకునేలా అవగాహన కల్పిస్తున్నాడు. తాము పై చదువులు చదవాలనుకుంటున్నామని, అందు కోసం పాఠశాలకు వెళ్లాలని అనుకున్నామని అక్కడికి చదువుకోవడానికి వస్తున్న పిల్లలు చెప్తున్నారు. అందుకే ఇక్కడి వచ్చి చదువుకుంటున్నామని తెలిపారు.