
హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో అర్థరాత్రి హై టెన్షన్ నెలకొంది. ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ నివాసంపై అర్థరాత్రి పోలీసులు దాడి చేశారు. సెర్చ్ వారెంట్ లేకుండా తన ఇంట్లోకి పోలీసులు రావడంపై మధుయాష్కీ గౌడ్ మండిపడ్డారు. అసలు ఎవరు కంప్లైట్ చేశారో చెప్పాలని ఆయన పోలీసులను నిలదీశారు.
అనుమతి లేకుండా మూకుమ్మడిగా పోలీసుల బృందం ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడడంతో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు.మధుయాష్కీ నివాసంలో పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.
ఓటమి భయంతోనే ఎల్బీ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసులను పంపించారని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. దీనిపై రేపు ఈసీ ఫిర్యాదు చేస్తామని తెలిపారు. పోలీసుల తనిఖీల విషయం తెలియడంతో అక్కడికి భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకొని మధుయాష్కీకి మద్దతు తెలిపారు.