
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫామ్ హౌస్ లపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న 32 ఫామ్ హౌసుల్లో తనిఖీలు నిర్వహించారు. నాలుగు ఫాం హౌసుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించారు. మొయినాబాద్‌లోని బిగ్‌బాస్ ఫామ్‌హౌస్, జహంగీర్ డ్రీమ్ వ్యాలీ , శంషాబాద్ పరిధిలోని రిప్లెజ్ ఫామ్ హౌస్, మేడ్చల్‌లోని గోవర్ధన్ రెడ్డి ఫామ్ హౌస్ లలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. 23 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి భారీగా మద్యం బాటిళ్లు, హుక్కా సామాగ్రి, ప్లేయింగ్ కార్డ్స్, 1.03 లక్షల నగదు, 7 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు.