మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం.. రూ. కోటి, అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ స్వాధీనం.. రూ. కోటి, అత్యాధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం

భద్రాచలం, వెలుగు: చత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రంలోని నారాయణ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లా అబూజ్‌‌‌‌‌‌‌‌మఢ్‌‌‌‌‌‌‌‌ అడవుల్లో మావోయిస్టుల డంప్‌‌‌‌‌‌‌‌ను భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి. నారాయణ్‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ ఎస్పీ రాబిన్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ గుడియా తెలిపిన వివరాల ప్రకారం... డీఆర్‌‌‌‌‌‌‌‌జీ, ఎస్టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ జవాన్లతో పాటు స్థానిక పోలీసులు మంగళవారం అబూజ్‌‌‌‌‌‌‌‌మఢ్‌‌‌‌‌‌‌‌ అడవుల్లో కూంబింగ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న సమయంలో డంప్‌‌‌‌‌‌‌‌ను గుర్తించారు.

డంప్‌‌‌‌‌‌‌‌లో రూ.1,01,64,00తో పాటు మూడు ఏకే 47 తుపాకులు, మూడు ఎస్‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌లు, 303, 315 రైఫిల్స్, రెండు 12 బోర్​తుపాకులు, రెండు నాటు తుపాకులు, ఎయిర్‌‌‌‌‌‌‌‌గన్‌‌‌‌‌‌‌‌, ఐఈడీలు తయారు చేసే సామగ్రి, మేగజైన్లు, బీజీఎల్‌‌‌‌‌‌‌‌ షెల్స్‌‌‌‌‌‌‌‌, ఎలక్ట్రానిక్​ డిటోనేటర్లు, వైరు బండిల్స్, వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌‌‌‌‌ సెట్లు, వాకీటాకీలు, రేడియోలు, ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ సామన్లు, మావోయిస్టు లీడర్ల పోస్టర్లు, మూడు కిలోల వైట్‌‌‌‌‌‌‌‌ పౌడర్‌‌‌‌‌‌‌‌, ఐదు కిలోల ఐఈడీలో వాడే చూర్ణం గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రాబిన్‌‌‌‌‌‌‌‌సన్‌‌‌‌‌‌‌‌ గుడియా వెల్లడించారు.