న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసుల ఆంక్షలివే..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. పోలీసుల ఆంక్షలివే..

న్యూ ఇయర్ వచ్చేస్తోంది. కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నగరంలో ఉన్న రెస్టారెంట్స్, బార్స్, పబ్బుల్లో ఈవెంట్స్ నిర్వహించేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు హైదరాబాదులో పోలీసుల ఆంక్షలు విధించారు. పబ్బుల్లో మైనర్లను అనుమతివ్వడం, వేడుకల్లో గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన సమయం వరకే మద్యం అమ్మకాలు చేయాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు.

న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించే ఈవెంట్స్ కోసం పది రోజుల ముందే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. పబ్బులు, ఈవెంట్స్ లలో అశ్లీల నృత్యాలు, అధిక శబ్దాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. 45 డేసిబుల్స్ కంటే ఎక్కువ శబ్దాలు రాకుండా చూసుకోవాలన్నారు. ఈవెంట్స్ మొత్తం కవర్ అయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సామర్థ్యం కంటే ఎక్కువగా పాసెస్ లను ఇవ్వకూడదని తెలిపారు. ఈవెంట్స్, పబ్బుల నుంచి ఇళ్లకు వెళ్లే వారికి క్యాబ్ లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. 

  • స్టార్ హోటల్, పబ్స్, ఈవెంట్స్ లలో.. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమంటూ బోర్డులు ఏర్పాటు చేయాలి.
  • మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు.
  • డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి దొరికితే 10,000 జరిమానా.. ఆరు నెలలు జైలు శిక్ష.
  • మైనర్లు వాహనం నడిపి పట్టుబడితే వాహన యజమానిపై చర్యలు.
  • పబ్బులు ఈవెంట్స్ జరిగే చోట్లలో యాజమాన్యాలే పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలి.
  • న్యూ ఇయర్ వేడుకల్లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాలి.