కాచిగూడ చౌరస్తా తారకరామ థియేటర్ వద్ద రూ. 28 లక్షలు సీజ్

కాచిగూడ చౌరస్తా తారకరామ థియేటర్ వద్ద  రూ. 28 లక్షలు సీజ్

బషీర్ బాగ్/ఘట్ కేసర్, వెలుగు:  లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో  కాచిగూడ చౌరస్తా తారకరామ థియేటర్ వద్ద మంగళవారం గోషామహల్ సెగ్మెంట్ ఫ్లైయింగ్ స్క్వాడ్ టీమ్ తనిఖీలు చేపట్టారు.  సికింద్రాబాద్ సీటీసీ నుంచి బైక్ పై బర్కత్ పురాలోని తన ఇంటికి అనూప్ సోని వెళ్తుండగా ఆపి తనిఖీ చేశారు. అతని వద్ద రూ. 25 లక్షల డబ్బు ఉండగా.. వాటికి ఎలాంటి ఆధారాలు చూపకపోగా నగదును సీజ్ చేసి సుల్తాన్ బజార్ పోలీసులకు అప్పగించారు.

ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు సుల్తాన్ బజార్ పోలీసులు తెలిపారు. అలాగా కొండాపూర్ కు చెందిన జవ్వాజి బాలకృష్ణ(36) నగదు తీసుకుని వెళ్తుండగా.. ఘట్ కేసర్​లోని  అంబేద్కర్ విగ్రహం వద్ద పోలీసులు ఆపారు. అతని వద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో డబ్బును సీజ్ చేసినట్టు ఇన్ స్పెక్టర్ సైదులు తెలిపారు.