అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి : డీఎస్పీ నాగేంద్ర చారి

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి : డీఎస్పీ నాగేంద్ర చారి

మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని డీఎస్పీ నాగేంద్ర చారి తెలిపారు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొల్లారం గ్రామంలో వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి అధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన పత్రాలు లేని 40 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తామని చెప్పారు. 

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని నాగేంద్ర చారి సూచించారు. గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే పోలీసులకి సమాచారం అందివ్వాలని కోరారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సూచించారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 ట్రోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయాలని తెలిపారు.