సహస్రను చంపింది 10వ తరగతి అబ్బాయి: కూకట్‎పల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు

సహస్రను చంపింది 10వ తరగతి అబ్బాయి: కూకట్‎పల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలన సృష్టించిన కూకట్‎పల్లి బాలిక సహస్ర హత్య కేసును ఛేదించారు పోలీసులు. 10వ తరగతి చదివే అబ్బాయి సహస్రను హత్య చేసినట్లుగా తేల్చారు పోలీసులు. సహస్ర ఇంటి పక్క బిల్డింగ్‎లోనే నిందితుడు ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లి అడ్డు వచ్చిన సహస్రను దారుణంగా చంపేశాడు నిందితుడు. 

పోలీసుల వివరాల ప్రకారం.. బాలుడు సహస్ర ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. ఇంట్లోకి చొరబడి 80 వేలు తీసుకుని పారిపోతుండగా సహస్ర బాలుడ్ని చూసి అడ్డుకుంది. సహస్ర ప్రతిఘటించడంతో బాలిక గొంతు నులిమి హత్య చేశాడు నిందితుడు. సహస్ర చనిపోయిందో లేదో అనే అనుమానంతో గొంతు కోసిన నిందితుడు.. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని బాలిక శరీరంపై విచక్షణరహితంగా కత్తితో పొడిచాడు. 

దొంగతనం ఎలా చేయాలో నిందితుడు ముందే ప్రిపేర్ అయ్యాడు. హౌ టు ఎంటర్ హోమ్, హౌ టు బ్రేక్ గాడ్ హుండీ, హౌటూ ఎస్కేప్ అంటూ పేపర్‎లో స్ర్కిప్ట్ రాసుకున్నాడు బాలుడు. ప్లాన్‎లో భాగంగా వచ్చేటప్పుడే నిందితుడు కత్తి వెంట తెచ్చుకున్నాడు. అంతా ప్లాన్ ప్రకారమే జరగగా.. డబ్బులు తీసుకుని పారిపోతున్న సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న సహస్ర చూసి అడ్డుకోవడంతో.. తన దొంగతనం గురించి ఎక్కడ బయటపడుతుందోనని సహస్రను కిరాతంగా హత్య చేశాడు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్ కూకట్‎పల్లిలో పదకొండేండ్ల బాలిక సహస్ర దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. బాలిక తల్లిదండ్రులు ఇద్దరూ పనికి వెళ్లిన సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో దారుణ హత్యకు గురయ్యింది.  పట్టపగలు బాలిక ఇంట్లోనే జరిగిన ఈ హత్యోదంతం స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. బాలిక మెడ, ఛాతీ, పొట్ట భాగంలో కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు దుండగుడు. 

సహస్ర మర్డర్ సంచలనం సృష్టించడంతో పోలీసులు ఈ కేసును సీరియస్‎గా తీసుకుని దర్యాప్తు  చేపట్టారు. చివరకు సహస్త్రను హత్య చేసింది ఇంటి పక్కనే ఉన్న 10వ తరగతి అబ్బాయిగా పోలీసులు గుర్తించారు. బాలికను హత్య చేసింది 10వ తరగతి చదివే విద్యార్థి అని తెలియడంతో స్థానికులు నిర్ఘాంతపోయారు. 10వ తరగతిలోనే ఇంతా క్రిమినల్ బ్రెయిన్ ఏంటి అనుకోని షాక్ అవుతున్నారు. 


►ALSO READ | డిప్యూటీ సీఎం పవన్ ను కలిసిన ఫారెస్ట్ సిబ్బంది.. శ్రీశైలం అడవి దాడి కేసులో ట్విస్ట్..