
శాయంపేట, వెలుగు: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడిని పోలీసులు హాస్పిటల్కు తరలించారు. సోమవారం పరకాల నుంచి హన్మకొండ వైపు వెళ్తున్న వాహనదారుడు నాగారానికి చెందిన పోసారి యుగేందర్ శాయంపేట మండలంలోని మాందారిపేట శివారులో కుక్క అడ్డు రావడంతో బైక్ పై నుంచి పడగా గాయాలయ్యాయి. అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో ఎస్సై అక్కినపల్లి ప్రవీణ్ కుమార్ తమ వాహనంలో యువకుడిని ఎక్కించి పరకాల సివిల్ హాస్పిటల్కు తరలించి ట్రీట్ మెంట్ అందించారు. సీఐ వెంకటేశ్వరరావు ఎస్సై ప్రవీణ్ కుమార్ ను అభినందించారు.