
వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు, తాండూరు పట్టణ వాస్తవ్యుడు దొరిశెట్టి సత్యమూర్తి అదృశ్యమయ్యారు. మూడు నెలల క్రితం ఆయన భార్య అన్నపూర్ణ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈనేపథ్యంలో తన భార్య మిస్సింగ్ కేసులో పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని ఆరోపిస్తూ దొరిశెట్టి సత్యమూర్తి సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 3 నెలల క్రితం అదృశ్యమైన తన భార్య ఆచూకీని కనిపెట్టాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఇందుకు 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి సత్యమూర్తి .. పరిగి, షాద్ నగర్, శంషాబాద్ మీదుగా ముంబైకి వెళ్లి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. వారిని గాలించేందుకు తాండూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ముంబైకి బయలుదేరాయని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆదివారం వెల్లడించారు.