
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్ పూర్ పోలీసులు ఓ వినూత్న ఆలోచన చేశారు. పోలీసులకు ఒక్కోసారి సెలవులు తీసుకునేందుకు అవకాశం లేకపోవడంతో తమ కుటుంబసభ్యులకు చాలా రోజులు దూరంగా ఉండాల్సి వస్తుంది. వాళ్ల చిన్న చిన్న సరదాలను కూడా కోల్పోతుంటారు. ఇక మీదట అలా జరగకూడదని భావించిన పోలీసుల పుట్టినరోజున వాళ్లకు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆరోజు కుటుంబసభ్యులతో సంతోషంగా గడపడంతో వాళ్లు ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారని ఆశిస్తున్నారు. అంతేకాక వాళ్ల పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా గ్రీటింగ్ కార్డు, స్వీట్ బాక్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు రాయ్ పూర్ పోలీసులు.