టాలీవుడ్ టాప్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ

టాలీవుడ్ టాప్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ

పొలిమేర2(Polimera2).. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హారర్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పొలిమేర సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. దీంతో మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా. నిజానికి ఈ పొలిమేర సీక్వెల్ కోసం ఆడియన్స్ చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సత్యం రాజేష్, రాకేందుమౌళి,గెటప్ శ్రీను ప్రధాన పాత్రలో కనిపించారు.  

Also Read :- సత్యభామ టీజర్ క్రాకర్

ఇక ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ రోల్ లో నటించిన కామాక్షి భాస్కర్ల తన అద్భుతమైన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా విజయంతో ఆమె టాలీవుడ్ నుండి వరుస ఆఫర్స్ అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం రీసెంట్ గా ఆమె ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన దర్శకుడు వశిష్టతో విశ్వంభర అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం కామాక్షి భాస్కర్లను తీసుకోనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు మేకర్స్. ఈ సినిమాతో కామాక్షి భాస్కర్ల టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ అవడం ఖాయం అనే చెప్పొచ్చు.