మార్చి 13న మాలల సింహగర్జన

మార్చి 13న మాలల సింహగర్జన

ఖైరతాబాద్, వెలుగు : రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయంతో దళితుల మధ్య చిచ్చు పెడుతున్నాయని, సుప్రీం కోర్టు, జాతీయ ఎస్సీ కమిషన్ లు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని చెప్పినా రాజకీయ పార్టీలు హామీలిచ్చి మోసం చేస్తున్నాయని మాల మహానాడు ప్రెసిడెంట్ చెన్నయ్య అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌‌‌‌‌‌‌‌క్లబ్‌‌‌‌‌‌‌‌ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ కార్యకర్తల్లాగా వ్యవహరిస్తున్నారని, వీరు కేంద్రంలో ఒక లాగా, రాష్ట్రంలో ఒకలాగా ద్వంద్వ నీతిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తెలంగాణాలో ఎస్సీల వర్గీకరణకు వివిధ పార్టీలు అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా తెలంగాణవ్యాప్తంగా పర్యటించి మాల ఉపకులాల్లో చైతన్యం నింపుతామన్నారు. మార్చి 13న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో మాలల సింహగర్జన పేరుతొ లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నమన్నారు. కార్యక్రమంలో గిరిధర్, బల్వంత్ రావు, రాంచందర్ పాల్గొన్నారు.