కేసీఆర్ కుట్రపన్ని నాపై తప్పుడు ప్రచారం చేశారు

కేసీఆర్ కుట్రపన్ని నాపై తప్పుడు ప్రచారం చేశారు

కాంగ్రెస్ మహిళా నేత, సినీ న‌టి విజయశాంతి అలియాస్ రాములమ్మ కాషాయ కండువా కప్పుకున్నారు. సోమ‌వారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. విజయశాంతికి కాషాయ కండువా కప్పిన ఆయన.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన అనంత‌రం ఆమె మీడియాతో మాట్లాడుతూ…‘‘ జ‌న‌వ‌రి 26, 1998లో బీజేపీలో చేరి నా రాజకీయ జీవితం ప్రారంభించా. తెలంగాణ కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాను. ఆ తర్వాత కొన్ని కార‌ణాల వ‌ల్ల పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. 2005 మే లో బయటకు వచ్చి తెలంగాణ లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీ నెలకొల్పాను. అనేక సమస్యలపై పోరాటం చేశాను అని అన్నారు.

ఆ స‌మయంలో త‌న ‌పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయమని కేసీఆర్ త‌న‌పై ఒత్తిడి తెచ్చారన్నారు విజ‌య‌శాంతి. టీఆర్ఎస్ కోసం ఎవరు ఉండకూడదు, ఏ పార్టీ ఉండకూడదన్న కేసీఆర్ దురుద్దేశ్యంతో వ్యవహరించారన్నారు. కేసీఆర్ కంటే ముందే తాను తెలంగాణ కోసం పోరాడుతూ వచ్చాన‌ని, టీఆర్ఎస్ నుంచి ఇద్దరం ఎంపీలుగా గెలిచిన త‌ర్వాత .. 2013 లో జూలైలో, అదే రాత్రి త‌న‌ను సస్పెండ్ చేశారని ఆమె అన్నారు. ముందు నుంచే కేసీఆర్ త‌న‌పై కుట్రపూరితంగా వ్యవహరించారని, నేనే పార్టీ నుంచి బయటకు వెళ్లానని ప్రచారం చేశారని అన్నారు.

తెలంగాణ ఇస్తే TRS ను పార్టీ ని విలీనం చేస్తానని సోనియాకు చెప్పిన ఆయ‌న‌.. ఆ త‌ర్వాత యూటర్న్ తీసుకున్నారన్నారు. తెలంగాణ లో కొట్లాడే నేతలు ఉండకూడదన్న యోచనలో కేసీఆర్ వారందర్నీ త‌న‌ పార్టీ లో చేర్చుకున్నారన్నారు. కానీ, ప్రస్తుతం కానీ.. ప్రస్తుతం తెలంగాణ టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్నారు. తెలంగాణ లో అత్యధికంగా అవినీతి జరుగుతోందని, త్వ‌ర‌లోనే కేసీఆర్ గద్దె దించుతాం, ఆయన అవినీతిని బయట పెడతాన‌ని విజ‌య‌శాంతి అన్నారు. రేపు తెలంగాణలో రాబోయేది బిజేపి ప్రభుత్వమేన‌ని, విజయ శాంతి ఎక్కడ ఉన్నా.. కీలక పాత్రే పోషిస్తుంద‌ని ఆమె అన్నారు.