మనల్ని పాలించే వారికి మెరిట్ ఉండాలి

మనల్ని పాలించే వారికి  మెరిట్ ఉండాలి

హైదరాబాద్: ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ.. అది సక్రమంగా అమలు కాలేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన బీసీ ఉద్యోగుల సంఘం డైరీ, కాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈటల.ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే సమాజ సంక్షేమం కోసం పోరాడే వాళ్ళమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. దేశ పౌరిడిగా, సగటు మనిషిగా స్పందించాలన్న ఆయన.. ఎర్రకోట సాక్షిగా మన రాజ్యాంగం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ.. అది సక్రమంగా అమలు కాలేదన్నారు. అందుకే మనం క్రిమిలేయర్ గురించి మాట్లాడుకుంటున్నామని..మెరిట్ లేకుండా ఏ సీటు రాదు.. అలాగే మనల్ని పాలించే వారికి కూడా మెరిట్ ఉండాలన్నారు. రాజ్యాంగాన్ని అర్దం చేసుకోగలగడమే ఆ మెరిట్ అని..సంపద కేంద్రీకరించడం పేదరికానికి కారణం అన్నారు. అంబానీ ఒక్కడి సంపద పెరిగితే పేదరికం పొదని.. ఎలుకల బాధకు ఇల్లుని తగలబెట్టుకోవద్దన్నారు. ఢిల్లీ రైతు బాధ ఏదో ఒక నాడు నీ గడప కూడా తొక్కుతుందని..ఉద్యమాలు ప్రజలకోసం చేస్తే వారికి గొంతు కలపాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాలు మాట్లాడుత లేనన్న ఈటల.. రైతుల కోసం మాట్లాడుతున్నానన్నారు. కేంద్రం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పారు మంత్రి ఈటల.