
- క్యూఐ 168గా నమోదు
- సౌండ్ పొల్యూషన్ ఎక్కువే..
హైదరాబాద్, వెలుగు : దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్లో గాలిలో నాణ్యత క్షీణించింది. సాధారణ రోజులతో పోలిస్తే పండుగ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) అధికంగా 168 నమోదైనట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(పీసీబీ) తెలిపింది. సెంట్రల్పీసీబీ ఆదేశాల మేరకు రాష్ట్ర పీసీబీ.. దీపావళి సందర్భంగా ఈనెల 6 నుంచి 19 వరకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సాధారణ రోజుతో పోలిస్తే దీపావళి రోజు గాలిలో సల్ఫర్డై ఆక్సైడ్, నైట్రోజన్ స్థాయి పెరిగిందని తెలిపింది.
సాధారణంగా గాలిలో ప్రతి ఘనపు మీటరుకు 60 మైక్రోగ్రాముల ఫైన్పార్టిక్యూలేట్మ్యాటర్( పీఎం 2.5) ఉండాలి. కానీ.. పండుగ రోజు అది 119గా నమోదైంది. అలాగే 100 ఉండాల్సిన పీఎం10 కు 188గా నమోదైందని పీసీబీ తెలిపింది. అలాగే సౌండ్పొల్యూషన్సాధారణ రోజుల్లో ఇండస్ట్రీయల్ఏరియాల్లో ఉండేదానికంటే దీపావళి రోజు రెసిడెన్షియల్ ఏరియాల్లో ఎక్కువ నమోదైందని పేర్కొంది.