పాలిసెట్ సీట్లను అలాట్ మెంట్ చేయండి ..సాంకేతిక విద్యా మండలి ముందు ఎస్ఎఫ్‌‌ఐ ధర్నా

పాలిసెట్ సీట్లను అలాట్ మెంట్ చేయండి ..సాంకేతిక విద్యా మండలి ముందు ఎస్ఎఫ్‌‌ఐ ధర్నా

హైదరాబాద్, వెలుగు: పాలిసెట్ సీట్ల అలాట్మెంట్ పూర్తి చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాంకేతిక విద్యామండలి ముందు సోమవారం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, సిటీ సెక్రటరీ అశోశ్ రెడ్డి మాట్లాడారు.

 షెడ్యూల్ ప్రకారం పాలిసెట్ ఫస్ట్ సీట్ల అలాట్మెంట్ ఈ నెల 4నే జరగాల్సి ఉన్నా..  ఇంకా అలాట్ చేయలేదన్నారు. దీంతో వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 24వేల మందికిపైగా విద్యార్థుల్లో ఆందోళన మొదలైందన్నారు. కనీసం ఎప్పుడు ఇస్తారనే వివరాలు కూడా పేరెంట్స్, స్టూడెంట్లకు ఇవ్వకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శమని చెప్పారు. 

హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేస్తే స్పందించడం లేదన్నారు. ఫీజులు నిర్ణయించలేదని అందుకే ఆలస్యం చేశామని చెప్పడం విడ్డూరంగా ఉందని, ఫీజులే నిర్ణయించనప్పుడు కౌన్సెలింగ్ ఎలా నిర్వహించారని ప్రశ్నించారు.ఈ సందర్భంగా ఎస్బీటెట్ సెక్రటరీ పుల్లయ్య వచ్చి విద్యార్థి నేతలతో మాట్లాడారు. రెండు రోజుల్లో కౌన్సెలింగ్ కంటిన్యూ చేస్తామని హామీనిచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. ధర్నాలో ఎస్ఎఫ్ఐ నేతలు లెనిన్ గువేరా, రజనీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు