పాలిటెక్నిక్ @ హైటెక్..దేశంలోనే తొలిసారిగా సెమీ కండక్టర్, రియల్ ఎస్టేట్ డిప్లొమాలు 

పాలిటెక్నిక్ @ హైటెక్..దేశంలోనే తొలిసారిగా సెమీ కండక్టర్, రియల్ ఎస్టేట్ డిప్లొమాలు 
  • పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త సిలబస్ 
  • ఐఐటీ హైదరాబాద్, బిట్స్ పిలానీ, ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీతో ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీఈటీ ఒప్పందాలు
  • ఇప్పటికే ఓపెన్ బుక్ ఎగ్జామ్స్.. డిజిటల్ వాల్యుయేషన్
  • మారుతున్న పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్ రూపురేఖలు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్య రూపురేఖలు మారిపోతున్నాయి. కేవలం డిప్లొమా సర్టిఫికెట్ ఇచ్చే స్థాయి నుంచి నేరుగా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే  హైటెక్  లెవెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సాంకేతిక విద్యను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీఈటీ) తీసుకెళ్తోంది. ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా దేశంలోనే ముందెన్నడూ లేని సరికొత్త కోర్సులను ప్రవేశపెడుతూనే, పరీక్షల విధానంలో విప్లవాత్మక సంస్కరణలకు బోర్డు శ్రీకారం చుట్టింది. స్టేట్ లో మొత్తం 59 సర్కారు, 52 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి.

వీటిలో ప్రస్తుతం సర్కారు కాలేజీల్లో 18,788 సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో 14,352 సీట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రారంభమయ్యే కొత్త విద్యాసంవత్సరం నుంచి మొత్తం 35 ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను (25 పాతవి, 10 కొత్తవి) అందుబాటులోకి తెస్తున్నారు. వీటిలో సెమీకండక్టర్ టెక్నాలజీ (ఎస్​సీటీ), అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ మాన్యుఫాక్చరింగ్  టెక్నాలజీ (ఏఎంటీ), సివిల్ ఇంజినీరింగ్ – రియల్ ఎస్టేట్ అండ్ వాల్యువేషన్ , ల్యాడ్ స్కేప్ డిజైన్, మల్టీమీడియా అండ్  ఎలక్ర్టానిక్స్ ఇంజినీరింగ్ తదితర ఐదు కోర్సులు స్పెషల్ గా పెడుతున్నారు. ఈ ఐదు కోర్సులు దేశంలోనే మొదటిసారిగా మన దగ్గర ప్రవేశపెడుతుండటం విశేషం. ఈ కొత్త కోర్సుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,280 సీట్లను కేటాయించారు.

వీటితో పాటు ఎలక్ర్టానిక్ అండ్ వీడియో ఇంజినీరింగ్ (ఈవీ) కోర్సును డిప్లొమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ గా, డీసీసీపీ కోర్సును ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్, టెక్స్ లైట్ టెక్నాలజీ కోర్సును టెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైల్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీగా, ప్రింటింగ్ టెక్నాలజీని ప్రింటింగ్ టెక్నాలజీ అండ్ డేటా అనలిటిక్స్ గామార్చారు. వీటితో పాటు బయోటెక్నాలజీ, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ వంటి ఫ్యూచర్ కోర్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. 

టాప్ ఐఐటీ, బిట్స్, ఐఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీతో భాగస్వామ్యం..  

విద్యార్థులకు మంచి శిక్షణ ఇచ్చేందుకు టాప్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో టెక్నికల్ ఎడ్యుకేషన్​బోర్డు చేతులు కలిపింది. కొత్త కోర్సుల సిలబస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఐఐటీ హైదరాబాద్, సీఐఐ నిపుణుల భాగస్వామ్యంతో రూపొందించారు. బిట్స్ పిలానీ సహకారంతో కాలేజీల్లో టెక్నాలజీ ఆధారిత ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ద్వారా విద్యార్థులకు బిజినెస్ లిటరసీ, డిజిటల్ స్కిల్స్, ఎంట్రప్రెన్యూర్ షిప్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

ఇండస్ట్రీ ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజర్ కోసం ఫైనలియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 నెలల పాటు ఇంటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ తప్పనిసరి చేశారు. దీనికోసం పలు పరిశ్రమలు, సంస్థలతోనూ ఎంఓయూకు కుదుర్చుకుంటున్నారు. 2026–27 నుంచి కొత్త సిలబస్ అమల్లోకి రానున్నది. అయితే, గతేడాది ప్రభుత్వ కాలేజీల్లో 79 శాతం సీట్లు నిండగా, ఈసారి వంద శాతం సీట్లు నింపడమే లక్ష్యంగా అడ్మిషన్ అవేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నెస్ క్యాంపెయిన్  నిర్వహించారు. టెన్త్ స్టూడెంట్లకు ఉచితంగా పాలిసెట్ కోచింగ్, మాక్ టెస్టులు నిర్వహించారు. 

పరీక్షల్లో ఓపెన్ బుక్ సిస్టమ్.. 

ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీటీఈటీ కేవలం కోర్సులనే కాదు, పరీక్షా వ్యవస్థను కూడా దశలవారీగా అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రేడ్ చేసింది. విద్యార్థుల విశ్లేషణా సామర్థ్యాన్ని పెంచేందుకు ఓపెన్ బుక్ ఎగ్జామినేషన్(చూసి రాయడం)  విధానాన్ని కొనసాగిస్తోంది. ఫస్టియర్ లో ఇంగ్లిష్, సెకండియర్ లో మ్యాథ్స్, థర్డ్ ఇయర్ లో ఇండస్ర్టియల్ మేనేజ్మెంట్ సబ్జెక్టులకు ఈ సిస్టమ్ అమలు చేస్తున్నారు. దీంతో పాటు వాల్యువేషన్ లోనూ పారదర్శకత కోసం ఆన్ స్క్రీన్ డిజిటల్ ఎవాల్యుయేషన్ ను అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారి పాలిటెక్నిక్ కాలేజీల్లోనే ఈ విధానం అమలు చేశారు. వీటితో పాటు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు, ఈ ఆఫీస్ విధానం, ఆటోమేటెడ్ రిజల్ట్స్ ప్రాసెసింగ్ వంటి సంస్కరణలు అమలవుతున్నాయి. మరోపక్క స్టేట్​లోని 59 సర్కారు పాలిటెక్నిక్ కాలేజీలకు ఐఎస్ఓ సర్టిఫికేషన్ కూడా లభించడం గమనార్హం. 

పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరండి

పాలిటెక్నిక్ కాలేజీల్లో చేరే విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఈ ఏడాది కొత్త కోర్సులనూ అందుబాటులోకి తీసుకొచ్చాం. పాలిటెక్నిక్ = స్కిల్ + జాబ్ + ఫ్యూచర్  నినాదంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐఐటీ, ఐఎస్​బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల సహకారంతో సిలబస్ రూపొందించాం. స్టూడెంట్లు.. పాలిటెక్నికల్ కోర్సుల్లో చేరితే మంచి భవిష్యత్ ఉంటుంది.  - శ్రీదేవసేన, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్