
సెల్ ఫోన్ ఎక్కువగా వాడొద్దని తల్లిదండ్రులు హెచ్చరించినందుకు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ లోని సూరారంలో జరిగింది. లాల్ సాబ్ గూడలో పాలిటెక్నిక్ మూడో సంవత్సరం చదువుతుంది విద్యార్థిని. అయితే విద్యార్థినిని ఫోన్ ఎక్కువగా చూస్తున్నావని తల్లి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన విద్యార్థిని ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు. విద్యార్థిని మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.