తెలంగాణ రాష్ట్రానికి అవినీతి గ్రహణం పట్టుకుంది

తెలంగాణ రాష్ట్రానికి అవినీతి గ్రహణం పట్టుకుంది

మంత్రి కేటీఆర్ అహంకారపురితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. వరంగల్ పర్యటనలో ఆయన మాట్లాడిన తీరు చూస్తే..మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాజరిక పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా.. లేక కేసీఆర్ రాసిన రాజ్యాంగం నడుస్తుందా అని అనిపిస్తోందన్నారు.
 
కేటీఆర్ విచక్షణ కోల్పోయి, మతి భ్రమించి మాట్లాడుతున్నారన్న పొంగులేటి..మీరు మాట్లాడితే మంచిభాష, మేము మాట్లాడితే చెడ్డ భాష గా కనిపిస్తుందా అని అన్నారు. బీజేపీ నేతలపై, కార్యకర్తలపై.. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుబ్బాక,GHMC ఫలితాలతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుంటుంటే కళ్ళు ముసుకున్నది మీరు కాదా అని అన్నారు. రాష్ట్రానికి అవినీతి గ్రహణం పట్టుకుందన్నారు.

టీఆరెస్ లోని మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు పొంగులేటి సుధాకర్ రెడ్డి. 125 అడుగుల అంబేద్కర్ ఎక్కడ అని అన్నారు. కేంద్రం సహకరించట్లేదనే కుంటిసాకులు చెప్తున్నారని తెలిపారు.